ప్రేక్షకులకు ధన్యవాదాలు

శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. డిఫరెంట్‌ కంటెంట్‌, కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఈనెల 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి థ్రిల్లింగ్‌-ప్యాక్డ్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, మేము అనుకున్న హిట్‌ ఈ సినిమాతో అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంత మంచి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్‌ అందరికీ చాలా థ్యాంక్స్‌. సినిమాకి అద్భుతమైన రివ్యూస్‌ వచ్చాయి. మా కంటెంట్‌ని ప్రశంసిస్తూ ఇంత మంచి రివ్యూస్‌ ఇచ్చిన మీడియాకి ధన్యవాదాలు. సినిమా చూసిన ఆడియన్స్‌ చాలా ఎంజారు చేస్తున్నారు. ప్రేక్షకులకు ఇవ్వాల్సిన విజువల్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఈ సినిమాతో ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నిర్మాతలు చాలా సపోర్ట్‌ చేశారు. స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌కి థ్యాంక్స్‌. తొలి సినిమాతో విజయాన్ని అందుకున్న పురుషోత్తం రాజ్‌కి అభినందనలు. శ్రీచరణ్‌ అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మ్యూజిక్‌ బావుందని చెబుతున్నారు. విజరు రెండు బ్యుటీఫుల్‌ సాంగ్స్‌ ఇచ్చారు. షఫీ, అరుణ్‌, దేవి ప్రసాద్‌ అందరూ అద్భుతంగా నటించారు’ అని అన్నారు. ‘సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ఇది థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా. అందరూ థియేటర్స్‌లోనే చూడాలి. నిర్మాతలకు, నటీనటులకు ధన్యవాదలు. శివ ఈ సినిమాని బలంగా నమ్మారు. సినిమా హౌస్‌ ఫుల్‌ షోస్‌తో రన్‌ అవుతోంది’ అని దర్శకుడు పురుషోత్తం రాజ్‌ చెప్పారు. నిర్మాతలు స్నేహాల్‌, శశిధర్‌ మాట్లాడుతూ,’ఫుల్‌ ఫాల్‌ ప్రతి షోకి పెరుగుతుంది. చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి’ అని తెలిపారు.