నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్ర్రం ’35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. ఈనెల 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో ప్రజెంటర్ రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’ ఈ సక్సె్ చాలా తప్తిని ఇచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. సురేష్ ప్రొడక్షన్ ‘పిట్టగోడ’ ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. ఇందులో తన నటన సర్‌ప్రైజ్ చేసింది. చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్‌ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్‌గా చూడటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు నందు వల్లే ఇది సాధ్యమైంది. సినిమాని ఆదరిస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ‘మేము చాలా థియేటర్స్‌ని విజిట్ చేశాం. అన్నిచోట్ల సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతోంది. కిడ్స్, ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరోయిన్ నివేద థామస్ చెప్పారు. హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ,’ఒక మంచి సినిమా వస్తే ఆడియన్స్, మీడియా ఎంత గొప్పగా సపోర్ట్ చేస్తారో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది’ అని తెలిపారు. ‘సినిమాకి ప్రే్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది’ అని డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని చెప్పారు. నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడుతూ,’ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్‌తో థియేటర్స్‌కి రావడం, సినిమాని అనుభూతి చెందడం చూస్తుంటే మా మనసు నిండిపోయింది’ అని అన్నారు. ‘ఇంత యునానిమస్‌గా సినిమాకి అద్భుతంగా రివ్యూస్ రావడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత సజన్ యరబోలు చెప్పారు.