సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం ఈనెల 13న విడుదలైంది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్ చెప్పేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ,’చిన్న చిత్రమైనప్పటికీ పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థ్యాంక్స్. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మమ్మల్ని అభినందించారు. విజువల్స్, పాటలు ఇలా ప్రతీ దాని గురించి మాట్లాడారు. ఆడియెన్స్ ఫీడ్‌బ్యాక్ విని మాకు చాలా సంతోషం కలిగింఇ. ప్రేక్షకులు బాగానే ఉందని అన్నారు.. కానీ మీడియా వారు ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం. మీడియా కూడా మా మూవీని మెచ్చుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ‘మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్’ అని హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ చెప్పారు. సంగీత దర్శకుడు మార్కండేయ మాట్లాడుతూ, ‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తున్నారు. మా సినిమా జనాల్లోకి తీసుకెళ్లడంలో మీడియా ముఖ్య పాత్రను పోషించింది. నేను ఇచ్చిన పాటలను అందరూ ఎంజారు చేస్తున్నారు. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థ్యాంక్స్. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మా సినిమా మరోమారు నిరూపించింది’ అని అన్నారు.