నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల మంచి రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. హీరో నాగచైతన్య మాట్లాడుతూ,’సినిమాకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా కాలంగా ఇది మిస్ అయ్యాను. ఫైనల్‌గా మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ టాక్ పెరుగుతూ వెళ్తోంది. ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్‌కి రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్‌కి నచ్చే ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళంతా వస్తే సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు. ‘మా సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్ళకి కతజ్ఞతలు. ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని ముందే చెప్పాం. ఇందులో బెస్ట్ సర్ ప్రైజ్ మా హీరో. దుల్లగొట్టేశాడు. మాకు ఇంకో హీరో దేవిశ్రీ ప్రసాద్. తన మ్యూజిక్ అదిరిపోయింది. మా అందరికీ ‘తండేల్’ డైరెక్టర్ చందూ. శ్యాం దత్ విజువల్స్ ఆడియన్స్‌ని హత్తుకున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర అద్భుతమైన ఆర్ట్ వర్క్ ఇచ్చారు. వాసుకి కంగ్రాట్స్. ఈ రోజు నుంచి పండగ మొదలౌతుంది’ అని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన హీరో బాలకష్ణకి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. భరత్ భూషణ్, సెక్రటరీ కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కోశాధికారి టి. ప్రసన్న కుమార్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర్ ప్రసాద్, ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ కె అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం ఇండిస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కె అమ్మిరాజు, కోశాధికారి వి.సురేష్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ ఉమర్జీ అనురాధ, తెలుగు సినీ స్టంట్ డైరెక్టర్స్, స్టంట్ ఆర్టిస్ట్స్ యూనియన్ కోశాధికారి రమేష్ రాజా..ఇలా దాదాపు 10 అసోసియేషన్ల ప్రతినిధులు బాలకృష్ణని ఆయన నివాసంలో కలిసి, శాలువా కప్పి అభినందించారు.
త్వరలో బాలకష్ణని సన్మానించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఘనంగా ఏర్పాట్లు చేస్తునట్టు తెలిపారు.