సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో ఐవీవై ప్రొడక్షన్స్ నిర్మించిన కుటుంబ కథా చిత్రం ‘ఇంటింటి రామాయణం’. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మాతలు. రాహుల్ రామకష్ణ, నవ్య స్వామి, నరేష్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించి ప్రేక్షకులకు కతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు సురేష్ నరెడ్ల మాట్లాడుతూ,’ ‘ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరూ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా బాగా ఎంజారు చేస్తున్నారు. బాగా నవ్వుకుంటున్నారు, ఎమోషనల్ సీన్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. చూసినవాళ్లు అందరూ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు’ అని చెప్పారు. ‘మేం సినిమా చేసేటప్పుడే ఈ సీన్‌కి ప్రేక్షకులు నవ్వుకుంటారు, ఈ సీన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు అనుకునే వాళ్లం. కానీ మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన వచ్చింది’ అని నటి నవ్య స్వామి తెలిపారు.
నటుడు అంజి మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఖచ్చితంగా ఇంటిల్లిపాది వెళ్లి ప్రశాంతంగా థియేటర్‌లో కూర్చొని ఎంజారు చేసి, హ్యాపీగా నవ్వుకొని.. ఇంటికి వెళ్లి కూడా చెప్పుకొని చెప్పుకొని నవ్వుకునే సినిమా’ అని అన్నారు. ‘మేము థియేటర్‌కి వెళ్లి సినిమా చూసినప్పుడు ప్రేక్షకులందరూ మొదటి సీన్ నుంచి చివరి వరకు చాలా ఎంజారు చేశారు. మేం నవ్వుకుంటూ, ఎంత సరదాగా సినిమాలో నటించామో.. ప్రేక్షకులు కూడా అంతే సరదాగా ఎంజారు చేసుకుంటూ సినిమా చూస్తున్నారు. అందరూ ఈ సినిమాని మరింత ఆదరించండి’ అని నటి కవిత చెప్పారు.