అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బందం ‘థ్యాంక్యూ మీట్’ని నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ, ”హిడింబ’ని పెద్ద విజయం వైపు తీసుకువెళుతున్న ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో మేము అనుకున్నవన్నీ జరిగాయి. బిజినెస్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ వర్షంలో కూడా అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూసి సూపర్ హిట్ అని చెప్పడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా అందరికీ గొప్పగా రీచ్ అయ్యింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు’ అని నాయిక నందిత శ్వేతా అన్నారు.
దర్శకుడు అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ, ‘గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ ఈ వర్షాలని తట్టుకుని, మొన్న సెకెండ్ షో నుంచి మెల్లగా గ్రోత్ మొదలైంది. రెండు రోజులకి మూడు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాదాపు 70 శాతం బ్రేక్ ఈవెన్‌లో ఉన్నారు. వర్షాలు లేకపోతే ఈ రోజు, రేపు బ్రేక్ ఈవెన్ స్టేజ్‌కి వచ్చి అందరూ లాభపడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కతజ్ఞతలు. ఇంత వర్షంలో కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు’ అని నిర్మాత గంగపట్నం శ్రీధర్ చెప్పారు.