ప్రేక్షకులకు కృతజ్ఞతలు

సయ్యద్‌ సోహైల్‌ రియాన్‌, రూపా కొడవాయుర్‌ జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మిస్టర్‌ ప్రెగెంట్‌’. ఈ చిత్రాన్ని మైక్‌ మూవీస్‌ బ్యానర్‌లో అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి, రవీందర్‌ రెడ్డి సజ్జల నిర్మించారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ వింజనంపాటి రూపొందించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్స్‌లో రిలీజైంది. ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌ మెంట్‌ కలిసి తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మాట్లాడుతూ, ‘మా సినిమాకు మంచి సక్సెస్‌ అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్స్‌కు గట్స్‌ ఉండాలి. మా సినిమాలోని ఎమోషన్‌తో పాటు బ్రహ్మాజీ కామెడీ సూపర్బ్‌గా వర్కవుట్‌ అయ్యింది. ఆ సీక్వెన్స్‌ వస్తున్నప్పుడు థియేటర్‌లో డైలాగ్స్‌ వినిపించనంతగా ప్రేక్షకులు గోల చేస్తూ ఎంజారు చేశారు. కుటుంబమంతా కలిసి చూడాల్సిన మూవీ’ అని తెలిపారు. ‘ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ చాలా సంతోషంగా ఉంది. కొత్త కాన్సెప్ట్‌ అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగు తెరపై ఇలాంటి సినిమా రాలేదు. మేము ఆ ప్రయత్నం చేశాం. మా సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నారు’ అని నిర్మాత అప్పిరెడ్డి అన్నారు.
హీరో సోహైల్‌ మాట్లాడుతూ, ‘నేను పదహారేళ్లుగా ఇండిస్టీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నాను. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు.