పునర్వ్యవస్థీకరణ చేసిన సీఎం కు కృతజ్ఞతలు

నవతెలంగాణ – సిద్దిపేట
పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ శాఖ పునర్వ్యవస్థీకరణ చేసిన సీఎం కెసిఆర్ కు పంచాయత్ రాజ్ ఇంజినీర్ల తరుపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, హరీశ్ రావు సహకరించిన మంత్రి కేటీఆర్, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు అన్ని వేళల్లో మార్గదర్శకం వహించిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎమ్ఓ స్మితా సభర్వాల్ కు ఇంజనీర్-ఇన్-చీఫ్  సంజీవ రావు కి పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు , సిబ్బంది పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.