మున్నూరు కాపు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు

–  ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం

నవతెలంగాణ – మద్నూర్
మున్నూరు కాపుల ప్రత్యేక కార్పొరేషన్ డిమాండ్ ను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్నూరు కాపు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించడం పట్ల మద్నూర్ మండల కేంద్రంలో బుధవారం నాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చిత్రపటానికి మున్నూరు కాపులు పాలభిషేకం చేశారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్నూరు కాపుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో మున్నూరు కాపులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ కృషికి ముఖ్య నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు ఎస్ గంగరామ్ మద్నూరు గ్రామ అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ ప్రధాన కార్యదర్శి సందూర్ వార్ హనుమాన్లు ఉపాధ్యక్షులు కర్లవారు సాయిలు మున్నూరు కాపు పెద్దలు హనుమాన్లు స్వామి గడ్డం లక్ష్మణ్ కొండ గంగాధర్ గ్రామ సంఘం కార్యవర్గ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు.
.