నాకు అవార్డు రావడానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు

Thanks to the leaders who worked hard to get me the awardనవతెలంగాణ – తొగుట
నాకు అవార్డు రావడానికి కృషి చేసిన మాదిగ దండోరా నాయకులకు కృతజ్ఞతలని బొంబాయి, లింగాల వెంకట్ అన్నారు. మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ విగ్రహాo ముందు అవార్డు, సన్మానం కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న, గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకత్వంలో నాటి నుండి నేటి వరకు మాదిగల చైతన్యం కోసం, హక్కుల సాధన కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా దండోరా పోరాటంలో, క్రియా శీల పాత్ర పోషిం చామని అన్నారు. ఈనెల 7వ తేదీన దండోరా 30 సంవత్సరాల రజితోత్సవ సందర్భంగా మాదిగ ఉద్యమ వీరుని అవార్డు ప్రదానం చేశారని పేర్కొ న్నారు.1996 నుండి తొగుట మండలం తుక్కా పూర్ గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణ, గ్రామ కమిటీలను నిర్మాణం చేస్తూ, అగ్ర కులాల వేత నుండి అంటరాని తనానికై వ్యతిరేకంగా కుల వివ క్షత వ్యతిరేకంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్ర హాల ప్రతిష్ట చేయడంలో క్రియాశీల పాత్ర ఉందిని రాష్ట్ర నాయకులు గుర్తించి నాకు ఉద్యమ అవా ర్డు ఇవ్వడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఇందుకు నాకు అవార్డు ప్రధానం చేసిన రాష్ట్ర అధ్యక్షులు పాపన్న, గుర్రాల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్య క్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మాదిగ రాష్ట్ర కార్యదర్శి సిద్దిని రాజ మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు లింగాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి బోడా ప్రశాంత్, జిల్లా అధికార ప్రతినిధి లింగాల స్వామి, తొగుట మండల అధ్యక్షుడు రాంపురం రమేష్, జిల్లా కార్య దర్శి కాసర్ల నర్సింలు, మాదిగ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లింగాల మహేష్, సీనియర్ నాయకు లు కాసర్ల రాజు, ఆకారం రాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.