కథలో అసలు ట్విస్ట్‌ అదే..

కథలో అసలు ట్విస్ట్‌ అదే..‘హుషారు’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన యువ కథానాయకుడు తేజస్‌ కంచెర్ల. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్‌ ఉరికిఫైడ్‌’ సినిమా ట్యాగ్‌ లైన్‌. లీడ్‌ ఎడ్జ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై వివేక్‌ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ‘పట్నం పిల్లా..’, ‘ఓరి మాయలోడా..’ సాంగ్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. లేటెస్ట్‌గా సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘హీరోకి పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కావటం లేదని బాధ ఎక్కువ అవుతుంటుంది. అందుకు కారణం.. తనేమీ చదువుకోడు. కానీ బాగా చదువుకున్న పిల్లనే పెళ్లి చేసుకోవాల నుకుంటాడు. అతని ఆశలకు తగ్గట్టే హీరోయిన్‌ అతన్ని ప్రేమిస్తుంది. చాలా మంది చదువుకున్న అమ్మాయిలకు నచ్చని హీరోని హీరోయిన్‌ మాత్రం ఎందుకు ప్రేమించిందా! అనేది చాలా మందిలో ఉండే ప్రశ్న. కానీ.. కథలో అసలు ట్విస్ట్‌ అదే. మన హీరోయిన్‌లో మరో కోణం బయటకు వస్తుంది. దెబ్బకు హీరో భయపడతాడు. హీరో ఎందుకు భయపడ్డాడు?, చివరకు ఏమైందనేది ఈ చిత్ర కథ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.