
భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా పట్టణంలో గల స్థానిక రైతు బజార్ వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబిసి కోఆర్డినేటర్ బెండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజాసేవలో ముందు ఉంటూ ప్రజల కోసం నిరంతరం మమేకమై పనిచేశారన్నారు. ప్రభుత్వంలో ప్రజా పాలన కార్యక్రమాలలో విజయవంతం చేయడంలో ముందు వరుసలో ఉంటూ గత భువనగిరి నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కలను నిజం చేస్తూ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందడం శుభసూచకం అన్నారు.
అటువంటి మంచి వ్యక్తి భువనగిరి నియోజకవర్గంలో ప్రజా సేవకునిగా అనిల్ అన్నకు తిరుగులేదు ఇట్టి మంచి నాయకత్వాన్ని మునుముందు మంచి కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేయాలని అనిల్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఓబీసీ జిల్లా నాయకులు చిన్న బత్తిని లద్ధయ్య. పట్టణ కాంగ్రెస్ నాయకులు గాజుల క్రాంతి కుమార్. రత్న రాజశేఖర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పిసిసి సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ . గ్రంధాలయ చైర్మన్ అవెస్ ఛిస్థి. మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు. బర్రె జహంగీర్ గారు మాజీ కౌన్సిల్ సలావుద్దీన్. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ఎండి మజర్. మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి.బెండ ఆంజనేయులు పాల్గొన్నారు.