నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై దీనిని నిర్మిస్తున్నారు. దీనికి సుమంత్ దామ సహ నిర్మాత, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా స్వాతి రెడ్డి మాట్లాడుతూ, ‘మాకు తెలిసిన నిజాన్ని ఇందులో నిజాయితీగా చెప్పాం. ఆ నిజం ధైర్యం ఇచ్చేలా ఉంటుంది’ అని తెలిపారు.’మేము ఎంత ప్యాషనేట్‌గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా రీచ్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు చెప్పారు.