ఆ.. యూనివర్సల్‌ ఎమోషన్‌

అందరికీ కనెక్ట్‌ అవుతుందిచిరంజీవి నటిస్తున్న మాస్‌-యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ ఎంటర్టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత అనిల్‌ సుంకర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘చిరంజీవితో సినిమా చేయడం అనేది ఎవరికైనా ఒక కల.. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని ఊహించలేదు. చాలా మంది స్టార్స్‌తో సినిమాలు చేశాను. అయితే చిరంజీవి అనుభవం మా అందరికీ కలిసొస్తుంది. ఆయన చాలా చురుగ్గా ఉంటారు. మనతో మాట్లాడుతూనే .. సడన్‌ గా షాట్‌ రెడీ అయ్యిందని వాళ్ళు రాకముందే తెలుసుకొని వెళ్ళిపోతారు. ఆయన సమయపాలన అద్భుతం. ‘వేదాళం’ రీమేక్‌ను ఎఎం రత్నం చేద్దామని అనుకున్నారు. ఆయన నాకు బాగా క్లోజ్‌. వేరే వాళ్లకి అయితే ఇచ్చేవాళ్ళు కాదేమో. చిరంజీవితో సినిమా చేస్తున్నపుడు యూనిక్‌ సబ్జెక్ట్‌ కాకుండా రీమేక్‌ చేయడానికి కారణం ‘భోళా శంకర్‌’ సబ్జెక్ట్‌ నాకు చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్‌ వల్లే మాకు చిరంజీవి డేట్స్‌ వచ్చాయి. అలాగే చిరంజీవి ఈ సినిమా చేయడానికి మూలకారణం మెహర్‌ రమేష్‌. ఆయనకి కూడా ఈ సబ్జెక్ట్‌ చాలా ఇష్టం. రెండేళ్ళ క్రితమే ఈ సబ్జెక్ట్‌ చిరంజీవితో చెప్పారట. చిరంజీవికి చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ఓపెనింగ్స్‌ విషయంలో మేము అనుకున్న ఓపెనింగ్స్‌ వస్తాయి. ఇదొక మాస్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. అవుట్‌ పుట్‌ పై చిరంజీవి, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఖచ్చితంగా వర్క్‌ అవుట్‌ అవుతుంది. ఆల్రెడీ వర్క్‌ అవుట్‌ అయిన ఫీలింగ్‌ ఉంది. బ్రదర్‌, సిస్టర్‌ ఎమోషన్‌ యూనివర్సల్‌. అందరికీ కనెక్ట్‌ బాగా అవుతుంది. ఇందులో సిస్టర్‌ పాత్రలో కీర్తి సురేష్‌ ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. మహతి సాగర్‌ ఆల్రెడీ ప్రూవ్‌ చేసుకున్నారు. పెద్ద స్టార్‌ సినిమా ఇస్తేనే నెక్స్ట్‌ లెవల్‌కి వెళ్తారు. కొత్తవాళ్ళు పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా ఎదిగితే ఇండిస్టీకి కూడా మంచి పరిణామం. మహతి చాలా మంచి పాటలు ఇచ్చాడు. రీరికార్డింగ్‌ కూడా అద్భుతంగా చేశాడు. మహేష్‌ బాబుతో సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు నేను ప్రతిరోజు సెట్‌లో వుంటాను. నాకు,మహేష్‌కి మధ్య ఆ బాండింగ్‌ ఉంటుంది. మిగతా సినిమా చిత్రీకరణలకు నేను ఉండను. అయితే భోళా శంకర్‌ చేసేటప్పుడు ‘ఒక హీరోగా చెబుతున్న. ప్రతిరోజు మీరు సెట్‌లో ఉండాలి. నిర్మాత సెట్‌లో ఉంటే చిరంజీవి చాలా ఆనందపడతారు’ అని మహేష్‌ చెప్పారు. 120 వర్కింగ్‌ డేస్‌లో దాదాపు 40 రోజులు చింజీవితో ఉన్నాను. ఇది చాలా మెమరబుల్‌ జర్నీ. మా 14 రీల్స్‌లో నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాం’ అని తెలిపారు.