శ్రీ కష్ణ మూవీస్ బ్యానర్ పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో విష్ణు వంశీ, రియా కపూర్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా ‘పెన్ డ్రైవ్’. కె. రామకష్ణ నిర్మాత. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సాయి కుమార్ క్లాప్ నివ్వగా, నిర్మాత టి. రామసత్యనారాయణ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. మరో నిర్మాత కె రామకష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు ఎంఆర్ దీపక్ మాట్లాడుతూ, ‘ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఉచితంగా వచ్చే దేనికీ ఆశపడకూడదు. అలా ఆశపడితే ఇబ్బందులు పడతారనే అంశాన్ని చూపిస్తున్నాం. ఈ నెల 22వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’ అని తెలిపారు. ‘మంచికి మాత్రమే టెక్నాలజీని ఉపయోగించాలనే సందేశాన్ని ఈ చిత్రంలో చెబుతున్నాం. మంచి కాన్సెప్ట్‌తో ఉన్న సినిమా’ అని నిర్మాత కె రామకష్ణ అన్నారు.