అది దా సారు..

That's it..రామ్‌ కిరణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘స:కుటుంబానాం’. హెచ్‌.ఎన్‌.జి సినిమాస్‌ పతాకం పై, హెచ్‌.మహాదేవ గౌడ, హెచ్‌.నగరత్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదరు శర్మ దర్శకుడు. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ‘అది దా సారు’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ పాటకు మణిశర్మ అద్భుతంగ కంపోజ్‌ చేశారు. ఈ పాటలో మేఘా ఆకాష్‌ లుక్‌ సరికొత్తగా కనిపిస్తోంది. ఈ పాట ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకి భాను మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు. బీట్‌కి తగ్గట్టుగా ఆయన డిజైన్‌ చేసిన స్టెప్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. భాను మాస్టర్‌కి ఈ సాంగ్‌ మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.