అందుకే.. అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారు

అందుకే.. అందరూ బాగా కనెక్ట్‌ అవుతున్నారుహీరో నార్నే నితిన్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఆరు’. ఈ సినిమాకి అంజి.కే.మణిపుత్ర దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈనెల 15న విడుదలైంది. ప్రేక్షకుల ప్రశంసలతోపాటు బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంటూ.. బ్లాక్‌ బస్టర్‌ దిశగా పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అంజి.కె.మణిపుత్ర మీడియాతో మాట్లాడారు. సినిమా చూశాక ఎన్టీఆర్‌ బావుంది.. కామెడీని, క్లైమాక్స్‌ కూడా చాలా బాగా డీల్‌ చేశావు అన్నారు. అందరూ థియేటర్లకి రావడం లేదు అంటారు కానీ.. మంచి సినిమా వస్తే ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని నిరూపించావు. సెకండ్‌ సినిమా ఎప్పుడు తీస్తున్నావ్‌ అని అల్లుఅర్జున్‌ మాట్లాడారు.
మా ఫ్రెండ్స్‌ అందరూ చాలా హ్యాపీ. మా ఊర్లో సినిమా ఇంకా బాగా ఆడుతోంది. మా అమ్మానాన్నలకి సినిమాల గురించి పెద్దగా తెలియదు. సినిమా హిట్‌ అయ్యాక అందరూ వచ్చి మీ అబ్బాయి సినిమా చాలా బాగా తీశాడని చెబుతున్నారు అని ఇవాళ పొద్దున్నే ఫోన్‌ చేసి చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది.
సినిమా అందరికీ నచ్చడానికి కారణం సినిమాలో అన్ని రియల్‌గా జరిగేవి. హీరో నాగ చైతన్య కూడా అదే అన్నారు. థియేటర్లు అన్నీ బ్లాస్ట్‌ అవుతున్నాయి. దానికి కారణం అన్ని మనకు తెలిసిన పాత్రలు. కొన్ని సీన్లు కూడా నిజంగా నాకు జరిగినవి నేను చూసినవే. అందుకే సినిమా బాగా కనెక్ట్‌ అయ్యింది. రోజురోజుకీ కలెక్షన్లూ పెరుగుతున్నాయి. మా నిర్మాతకు డబ్బులొస్తే నాకూ ఆనందమే కదా. సినిమా ఇంకా ఆడుతుందనే నమ్మకం పెరిగింది.