నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో బొడ్రాయి పండుగ (నాభిశిల) తృతీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ప్రారంభమైనట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జల బిందెలతో కార్యక్రమం ప్రారంభం కాగా ఆడపడుచులందరూ కోలాటాలు వేయుచూ, ఉయ్యాలలు ఊగుతూ జల బిందెలలో నీటిని తీసుకుని వెళ్లి స్వామివారలకు జలాభిషేకాలు నిర్వహించారు. నేడు అమ్మవార్లకు బోనాలు సమర్పించుట,బలిహరణ చేయుట వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.