నవతెలంగాణ – ఆర్మూర్
బీజేపీ పట్టణ 56వ బూత్ అధ్యక్షుడు బరోడ్ వినోద్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. నిరంతరం పార్టీ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 56వ బూతులలో అత్యధిక మెజారిటీ సాధించి పెట్టినటువంటి కార్యకర్త అని పట్టణ అధ్యక్షులు మందుల బాలు అన్నారు. నేడు పట్టణంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.