61 ఏళ్ల నిబంధనను తొలగించాలి..

నవతెలంగాణ -డిచ్ పల్లి
61 ఏళ్ల నిబంధనను తొలగించి వీఆర్ఎ వారసులకు న్యాయం చేయాలని వీఆర్ఎల సంఘం డిచ్ పల్లి మండల అధ్యక్షులుగంగాధర్, ప్రధాన కార్యదర్శి సూర్యరాజ్ లు అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీఆర్ఎల వారసులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇన్నాళ్లుగా తామంతా విధులు నిర్వర్తించినప్పటికీ తమకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వీఆర్ఎలకు న్యాయం చేయాలని వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకుంటున్నమని వారన్నారు.