రామగుండం ఓసీపీ-2లో ప్రమాదం విచారకరం

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రామగుండం ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టు-2 గనిలో పైపులైన్‌ మరమ్మతులు చేస్తుండగా మట్టిపెళ్లలు కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందటం విచారకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాలతో గనుల్లో నిలిచిపోయిన నీటి తోడివేసేందుకు అవసరమైన పంపులు, వాటర్‌ పైపులైన్ల మరమ్మతుల సందర్భంగా ఈ ఘటన జరిగినట్టు తెలిసిందని పేర్కొన్నారు. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచించారు.