నిందితులను కఠినంగా శిక్షించాలి 

నిందితులను కఠినంగా శిక్షించాలి – వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి 
– కామారెడ్డి ఐఎంఏ అసోసియేషన్ 
నవతెలంగాణ –  కామారెడ్డి 
ఈ మధ్యకాలంలో వైద్యులపై దాడులు జరగడం పొరపాటుగా మారిందని కామారెడ్డి ఐఎంఈ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అన్నారు. కొలకత్తాలోని ఆర్ జి కె ఏ ఆర్ మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తమ విధులు ముగించుకుని సెమినార్ హాల్లో నిద్రిస్తున్న సమయంలో వైద్య కళాశాలలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి ఆమెపై దాడి చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల ధర్మశాల నుండి ప్రారంభమై ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించి తమకు న్యాయం చేయాలని, వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని నినాదాలు చేశారు. గతంలో కూడా కేరళ రాష్ట్రంలో మహిళా వైద్యురాలిని హత్య చేశారని పేర్కొన్నారు. ఆమె విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఒక రోగికి జ్వరం లేకున్నా ఉన్నదని చెప్పావంటూ ఆమె గొంతులో పొడిచి హత్య చేశారన్నారు. ఇలాంటి సంఘటన పునరావ్రుతం కాకుండా ఉండేందుకు కఠిన చట్టాలు తీసుకువచ్చి వైద్యులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు రమణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్, కోశాధికారి డాక్టర్ పవన్, సీనియర్ ఐఎంఏ సభ్యులు డాక్టర్ నవీన్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ వెంకటేశ్వర గౌడ్, డాక్టర్ వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు