నిందితులకు జీవిత ఖైదు విధించాలి

–  జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించనున్న మూకదాడి బాధితుడు తబ్రేజ్‌ అన్సారీ భార్య
న్యూఢిల్లీ : దాదాపు నాలుగేండ్ల క్రితం మూకదాడిలో హత్యకు గురైన తాబ్రేజ్‌ అన్సారీ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పది మంది నిందితులకు శిక్షా కాలాన్ని పెంచాలని తబ్రేజ్‌ అన్సారీ భార్య జార్ఖండ్‌ హైకోర్టులో అప్పీలు చేయనున్నారు. బుధవారం సెరైకెలాలోని అదనపు జిల్లా కోర్టు జడ్జి-1 అమిత్‌ శేఖర్‌ దోషులకు పదేండ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిచ్చారు. భారతీయ శిక్షాస్మతిలోని సెక్షన్‌ 304 కింద పది మంది నిందితులను దోషులుగా నిర్ధారించారు. అంతేకాకుండా, నిందితులం దరికీ ప్రత్యేకంగా రూ.15,000 జరిమానాగా డిపాజిట్‌ చేయాలని ఆదేశిం చారు. అయితే, ఈ తీర్పుపై తబ్రేజ్‌ అన్సారీ తరఫు న్యాయవాది అసంతృప్తిని వ్యక్తం చేశారు. ”మేము సెక్షన్‌ 302 (హత్యకు సమానమైన నేరపూరిత నర హత్య) కింద శిక్ష విధించాలని డిమాండ్‌ చేశాం. అయితే కోర్టు దానిని తోసి పుచ్చింది. గాయపడిన బాధితుడు నాలుగు రోజుల తర్వాత మరణిం చాడని చేసిన అభ్యర్థనపై ఐపీసీలోని సెక్షన్‌ 304కు మార్చింది. హత్య చేయాలనే ఉద్దేశ్యంతో రాత్రంతా నిర్దాక్షిణ్యంగా కొట్టినందున మేము దానిపై హైకోర్టులో అప్పీల్‌ చేస్తాం. శిక్ష మొత్తాన్ని జీవిత ఖైదుకు పెంచాలని కోరుకుం టున్నాము” అని తబ్రేజ్‌ భార్య శైష్టా పర్వీన్‌ తరఫు న్యాయవాది అల్తాఫ్‌ హుస్సేన్‌ అన్నారు. ఈ కేసులో మొత్తం 36 మంది సాక్ష్యం చెప్పారని తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు (సుమంత్‌ ప్రధాన్‌, సత్యనారాయణ నాయక్‌) సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా విడుదలయ్యారు. నిందితులలో ఒకరైన కుశాల్‌ మహాలీ విచారణ సమయంలో మరణించారు. 2019, జూన్‌లో తెల్లవారుజామున బైక్‌లను దొంగిలించారనే ఆరోపణపై సెరైకెలా-ఖర్సవాన్‌ జిల్లాలోని ధాత్కిడిV్‌ాలో తబ్రేజ్‌ను ఒక గుంపు కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి జూన్‌ 22న ప్రాణాలు కోల్పోయాడు.