
దళిత మహిళను దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి అని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కెవిపియస్ జిల్లా భవనం లో విలేకరుల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ &జిల్లా అధ్యక్షుడు మల్యాల సుమన్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన వల్లందాసు మంజుల (35) దళిత వివాహిత మహిళను అత్యంత దారుణంగా చున్నీతో వురి పెట్టీ కొట్టి చంపినరు దళిత మహిళలపై అత్యంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయని నిందితులు ఏదేచ్ఛగా తిరుగుతున్నారని ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు విధించాలని దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, డిమాండ్ చేశారు. నిందితులపైన హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మంజుల కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక డి యస్ పి సమగ్రంగా విచారణ జరిపి దోషులను కటినంగా శిక్షించాలని కోరారు.