
కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని భిక్కనూరు పట్టణంలో ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్లకు మద్దతుగా మహిళా డాక్టర్ హత్య చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని ఇందుకు నిరసనగా రెండు గంటలపాటు ప్రథమ చికిత్స సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి, పిఎంపి వైద్యులు సుదర్శన్, గంగాధర్, దయాకర్ రెడ్డి, ఆంజనేయులు, తేజస్కర్, తదితరులు పాల్గొన్నారు.