
– జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – కామారెడ్డి
వైద్య విద్యార్థినినీ ఘోరంగా హింసించి, హత్య చేసిన నిందితున్ని వంద రోజుల్లో ఉరితీయాలని కామారెడ్డి ఐఎంఏ, ఐడిఏ అసోసియేషన్ నాయకులు అన్నారు. శనివారం ఐఎంఏ, ఐడిఏ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్కడ జరిగిన సంఘటనను కప్పిపుచ్చేందుకు వైద్య కళాశాల నుండి విద్యార్థినిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుదని చెప్పడం బాధాకరమైన విషయం అన్నారు. ఆ తర్వాత విషయం వెలుగులోకి రాగా అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఈ కేసును సిబిఐ కి అప్పగించిందన్నారు. తెల్ల కోటు వేసుకొని పవిత్రమైన వైద్య వృత్తిని అందిస్తున్న మా తెల్ల కోర్టుపై రక్తాన్ని మరక వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు అండగా ఉండడం సొచనియమని ఇలాంటి దుండగులను పట్టుకుని 100 రోజుల్లో ఉరితీయాలి అన్నారు. మహిళ వైద్య విద్యార్థిని ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో వైద్య వృత్తిని చేపట్టేందుకు రాగా ఆమెపై ఇలాంటి దారుణం జరగడం మాయని మచ్చా అన్నారు. ఈ దూరంగా అతను చేసిన వ్యక్తిపై ఇంతవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. నిందితుని పట్టుకొని శిక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే దీనిని మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించి ఖండించవలసిన విషయం అన్నారు. వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్య పై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా మంటలు రగిలే అవకాశం ఉందని ఇలాంటి నిందితులకు బహిరంగ శిక్ష వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమణ, కార్యదర్శి డాక్టర్ అరవింద్ గౌడ్, అసోసియేషన్ నాయకులు డాక్టర్ రామలింగం, డాక్టర్ వెంకటరాజ్యం, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ శ్రీ లీల, డాక్టర్ ఉమా జనార్ధన్, డాక్టర్ రాజలక్ష్మి, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు మాధవి లత, కార్యదర్శి అభిషేక్ రెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు.