– 30 లక్షల పసుపు 40 లక్షల లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
నవతెలంగాణ – కంటేశ్వర్
పసుపు లారీ దొంగతనం చేసిన నిందితుడు నగరంలోని సుభాష్ నగర్ కు చెందిన షేక్ తోఫిక్ అలీ ని అరెస్టు చేసి 30 లక్షల పసుపును 40 లక్షల లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు సోమవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులోడు లారీ దొంగతనం కేసులో రిసీవర్స్ కొరకు గాలింపు చర్యలు చేపట్టామని, లారీ దొంగతనం పసుపును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు.