తాసిల్దార్ తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన అదనపు కలెక్టర్ 

నవతెలంగాణ – మద్నూర్ 

జుక్కల్ నియోజకవర్గం లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా నామినేషన్ల స్వీకరణ మద్నూర్ తహశీల్దార్ కార్యాలయం లో నిర్వహిస్తారు. బుధవారం నాడు కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి జుక్కల్ నియోజక వర్గం తహశీల్దార్ లతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహిస్తూ ఎన్నికల పై ప్రత్యేకంగా సమీక్షించడం ఓటర్ నమోదుపై పరిశీలించారు. నియోజకవర్గం పరిధిలోని మద్నూర్ బిచ్కుంద జుక్కల్ పెద్ద కోడప్పగల్ పిట్లం నిజాంసాగర్ మండలాల తాసిల్దార్లు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు.