ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతుబంధు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పతాకం పత్రాలను నిజాంబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ ఆదివారం అందజేశారు. మండలంలోని నారాయణపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతుబంధు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్, తాసిల్దార్ కిరణ్ మై, ఎంపీడీవో సతీష్ కుమార్, ఎంపీఓ యూసుఫ్ ఖాన్, డిప్యూటీ తాసిల్దార్ సీనియర్ అసిస్టెంట్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నారాయణపేట గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ రాజేందర్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిపెల్లి చిన్న సాయి రెడ్డి, బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ నర్సారెడ్డి, మండల వ్యవసాయ అధికారి దేవిక మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు లబ్ధిదారులు పాల్గొన్నారు.