
మండల కేంద్రమైన తాడిచెర్లలో నేడు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పర్యటన నేపథ్యంలో సోమవారం భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం,కాస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో అదనపు గదులు, సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు, తహశీల్దార్ రవికుమార్, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, వైద్యాధికారి రాజు పాల్గొన్నారు.