ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సొసైటీ కార్యదర్శులకు సూచించారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి సొసైటీ పరిధిలో ఉన్న కంచర్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎక్కడ కూడా ధాన్యం రోడ్డుపై ఉండవద్దని కొనుగోలను వేగవంతం చేయాలని సూచించారు. సొసైటీ పరిధిలో 8000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని ఇంకా 4000 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని సొసైటీ కార్యదర్శి మోహన్ గౌడ్ అదనపు కలెక్టర్ కు తెలియజేశారు. వారం రోజులలో ధాన్యం కొనుగోలు పూర్తవుతుందని తెలిపారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ తో పాటు డి ఎం సత్యానందం, డీఎస్ఓ మల్లికార్జున్, సివిల్ సప్లై డ్యూటీ కిష్టయ్య, రైతులు, తదితరులు ఉన్నారు.