ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మొదటి రోజు “2 కె రన్” ను ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రభుత్వ భువనగిరి జూనియర్ కళాశాల (బాలుర) నుండి భువనగిరి ఖిల్లా వరకు రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి పచ్చ జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి మట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వము ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోందని డిసెంబర్ 1 నుండి 9వ తేదీ వరకు జరిగే అన్ని కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు 2 కె రన్ ప్రోగ్రాం చాలా విజయవంతంగా నిర్వహించామని ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు వారి వారి షెడ్యూల్స్ ప్రకారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని తెలియజేస్తూ ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు. విజయ పథములో ముందుకు తీసుకుపోవాలి అని ఇట్టి విజయోత్సవాలు ప్రజల కు అర్దం అయ్యే విధంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. సెల్ ఫోన్ వద్దు ఆటలే ముద్దు,మహిళ లకు వరం మహాలక్ష్మి పథకం, రైతుల అండ రైతు బరోసా, అంటూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కృష్ణా రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రామాంజనేయ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కే ధనంజనేయులు, హెరిటేజ్ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి , అంజయ్య ,దిడ్డి బాలాజీ , జిల్లా అధికారులు, సిబ్బంది, నవభారత్ యువజన సంఘం నాయకులు కరుణ్ , విద్యార్థులు, జాతీయ , అంతర్ జాతీయ క్రీడాకారులు, యువతి యువకులు, క్రీడా ఉపాధ్యాయులు పాల్గొన్నారు