– ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తాం
– సమాచార పౌరసంబధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని సీట్లు బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తారని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ..దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల ఉనికి లేద న్నారు. ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ చెబుతు న్నవన్నీ బూటకాలని, ముందుగా పక్క రాష్ట్రం కర్నాటకలో అమలు చేయాలన్నారు. సీఎం కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పదేండ్లుగా చేవెళ్ల నియోజవర్గంలో ఎంతో అభి వృద్ధి చెందాయనీ, షాబాద్ మండలంలో చందన్ వెళ్లి, సీతారాంపూర్‌లో పెద్దపెద్ద కంపెనీలు వచ్చాయనీ, వాటిలో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నర్సింగ్‌రావు, ఎఎంసీ చైర్మన్లు వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, నాయకులు రాజేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.