మండలంలోని అవుతాపురం క్లస్టర్ ఏఈవో గా విశ్వశాంతి, చిట్యాల క్లస్టర్ ఏఈవో గా గడల రాజు పెద్దవంగర రైతు వేదిక లో మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. గతంలో విశ్వశాంతి నర్సంపేట, రాజు గూడూరు ఏఈవో లు గా పని చేస్తూ, బదిలీ పై పెద్దవంగర కు వచ్చారు. అనంతరం వీరు మండల వ్యవసాయ అధికారి గుగులోత్ స్వామి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏవో స్వామి మాట్లాడుతూ.. ఏఈవో నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. రుణమాఫీ కానీ రైతులు పెద్దవంగర ఏఈవో 7288891726, అవుతాపురం ఏఈవో 7288891725, చిట్యాల ఏఈవో 7288891724 లను సంప్రదించాలని సూచించారు.