
నవతెలంగాణ- బొమ్మలరామారం: నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం కలిపించి ఓటర్లకు భరోసా కల్పించాలని రాచకొండ కమీషనరేట్ భువనగిరి జోన్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు రాజేష్ చంద్ర అన్నారు. బొమ్మలరామారం మండలం లోని మల్యాల, పిజి తండా తిమ్మాపురం లలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు.. ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డిసిపి తో పాటుగా భువనగిరి ఏసిపి ఎస్. వెంకట్ రెడ్డి,బొమ్మలరామారం ఎస్ఐ G. శ్రీనివాస్ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.