– పాలడుగు వెంకటకృష్ణ మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామీణ స్థాయి పేద క్రీడాకారులకు తగిన క్రీడా ప్రోత్సాహాన్ని కల్పించడమే తన లక్ష్యమని మాజీ అంతర్జాతీయ వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు మరియు హైదరాబాద్ డాజిల్ స్పోర్ట్స్ అధినేత పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తారకరామా కాలనీకి చెందిన క్రీడాకారులకు వెంకటకృష్ణ 30000/- విలువ చేసే క్రికెట్ క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భముగా వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా డాజిల్ స్పోర్ట్ పని చేస్తుందని, తాను పుట్టిన గ్రామంలోని నిరుపేద ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారికి ప్రోత్సాహం అందిస్తూ, వారికి చేయూతగా నిలిచి, మంచి క్రీడాకారులు గా ప్రోత్సహించాలని అన్నారు. అలాగే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయని, క్రీడల వల్ల శారీరక దృఢత్వం కలిగి ఉంటారని, పటుత్వం కోల్పోకుండా ఉంటారని అన్నారు. అలాగే యువత కూడా క్రీడా రంగాల్లో రాణించాలని అన్నారు. క్రీడా రంగంలో రాణించే యువతకు నా ప్రోత్సాహం ఎప్పుడు లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తుమ్మల శివ, తలశిల రాఘవులు, యువ క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.