– మాస్కో సిటీ టూరిజం కమిటీ: చైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మాస్కోను బిజినెస్ టూరిజానికి ప్రాధాన్య గమ్య స్థానంగా ప్రమోట్ చేయడమే లక్ష్యంగా మాస్కో ఎంఐసీఈ (మైస్) అంబాసిడర్స్ ప్రోగ్రాం రూపొందించిన ట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ చైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ తెలిపారు. బిజినెస్, లీజర్ ట్రావెల్ అండ్ ఎంఐసీఈ (బీఎల్టీఎం) 2023 అవార్డు వేడుక ఘనంగా నిర్వహిం చారు. ఈ వేడుకలో భారతదేశంలోని మాస్కో ఎంఐసీఈ అంబాసిడర్స్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మొదటి 50 మందికి మాస్కో సిటీ టూరిజం కమిటీ సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఆయన మాట్లాడుతూ మహమ్మారికి ముందు భారతదేశం నుంచి పర్యాటకుల ప్రవాహం ఏటా 12 నుంచి 15 శాతం ఉండేదన్నారు. అనంతరం తగ్గినా ఇప్పుడు క్రమంగా పుంజుకుంటుందని, 2022 నాటికి మాస్కోలో అత్యధిక సంఖ్యలో భారతీయ వ్యాపార పర్యాటకులు రెండో స్థానంలో ఉండేవారన్నారు. మాస్కో సిటీ టూరిజం కమిటీ, ఎన్‌ఐఎంఏ (అసోసియేషన్ ఆఫ్ ఎంఐసీఈ ఏజెన్సీస్ ఆఫ్ ఇండియా) సంయుక్తంగా ఈ సంవత్సరం మాస్కో ఎంఐసీఈ అంబాసిడర్ల కార్యక్రమా న్ని ప్రారంభించాయన్నారు. ఈ ప్రోగ్రామ్ కింద 2024లో ఒక్కో దాంట్లో 50 మంది పాల్గొనే 4 స్ట్రీమ్‌లతో విస్తరించాలని భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 200 మంది మాస్కో ఎంఐసీఈ అంబాసిడర్లు ఉంటారని తెలిపారు. భారతదేశానికి అత్యంత ఆశాజన కమైన పర్యాటక ప్రదేశాలలో మాస్కో ఒకటన్నా రు. కనీసం 10 ప్రత్యక్ష విమానాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్ వీసాను ఉపయోగించవచ్చన్నారు. మాస్కోకు వ్యాపార పర్యాటకం ముఖ్యంగా భారతీయుల్లో ప్రసిద్ధి చెందిం దన్నారు. మైస్ అంబాసిడర్ ప్రోగ్రామ్‌తో ఈ ట్రెండ్‌ను కొనసాగించనున్నామని తెలిపారు. అక్టోబర్‌లో మీట్ గ్లోబల్ మైస్ కాంగ్రెస్ మాస్కోలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. భారతదేశం సహా 14 దేశాలు ఇందులో పా ల్గొంటాయని తెలిపారు. రష్యా, భారతదేశం మధ్య వ్యా పార పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మాస్కో ప్రతినిధి బృందం ఇప్పటికే వ్యాపార లక్ష్యంతో భారతదేశాన్ని సందర్శించిందన్నారు. కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై వంటి నగరాల్లో రష్యా రాజధాని సామర్థ్యాన్ని ప్రదర్శించిందన్నారు. నేషనల్ కోఆర్డినేటర్, చైర్మన్ గవర్నింగ్ బాడీ వ్యవస్థాపకుడు, ఎన్‌ఐఎంఏ గజేష్ గిర్ధర్ మాట్లాడుతూ మాస్కో ఎంఐసీ ఈ అంబా సిడర్స్ ప్రోగ్రాంకు భారతదేశం నుంచి అధిక స్పందన లభించిందన్నారు. ఇది ఎంఐసీఈ టూరిజం కోసం సమ కూర్చిన మౌలిక సదుపాయాలతో 12 నెలల గమ్యస్థా నంగా ఉందని, మాస్కో సిటీ టూరిజం కమిటీ అందిం చిన ప్రోత్సాహకాలను చాలా భారతీయ కార్పొరేషన్‌లకు ఇంకా చేరలేదని తెలిపారు.