– సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ – సంతోష్‌నగర్
తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది సంద ర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాం క్షలు తెలియజేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం బడంగ్‌పేట్ బంజారా నాయకులు స్థానిక నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత పుష్ప గుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడంగ్‌పేట పరిధి లోని బంజారా కుటుంబాలు 1000 మంది వరకు నివా సం ఉంటున్నారని తెలిపారు. బంజారా భవనం కమిటీ హాల్ నిర్మించాలని సీఎంకు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. దీనికి సీఎం సానుకూలంగా స్పదించినట్టు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బడంగ్‌పేట్ బంజారా అధ్యక్షులు వడ్త్యావత్ రాజేష్ నాయక్, ఉపాధ్యక్షులు బాజీ సింగ్ చౌహన్, ప్రధాన కార్యదర్శి రాందాస్ నాయక్, ఉప కార్యదర్శి రాములు నాయక్, కోశాధికారి నాగేశ్వరరావు నాయక్, గోవర్ధన్ నాయక్, ఇందల్ పవర్, మల్లికార్జున్ నాయక్, కార్యదర్శులు, మహిళా మణులు సుశీల రాజ్, సుజాత బారు, సీత బారు, మంగబాయి, జ్యోతిబారు, నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.