ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం…

– మతోన్మాదం,నియంతృత్వం నివారణే విధానం..

– ఇండియా కూటమి లో భాగంగా కాంగ్రెస్ కు మద్దతు..
– సీపీఐ(యం) జిల్లా కార్యదర్శి అన్నవరం కనకయ్య..
 నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏళ్ళతరబడి విదేశీయులు పై పోరాటం చేసిన ఎందరో త్యాగధనుల స్వాతంత్రం ఫలాన్ని,ప్రజల చేత రూపొందిన ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించుకోవడం మే సీపీఐ(యం) ప్రధాన లక్ష్యం అందుకు అనుగుణంగానే ఎన్నికల్లో రాజకీయ విధానం  ఉంటుందని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వినాయక పురం లో మండల కమిటీ సభ్యుడు గడ్డం సత్యనారాయణ అద్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సమైక్యత,సమగ్రత,స్వదేశీ ముసుగులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మతం పేరుతో హిందూ –  ముస్లిం సమాజాలు గా విడదీయడానికి ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. ప్రజాధనం తో ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ పెట్టుబడిదారులకు,కార్పోరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ వారి మేలు కోసమే మోడీ పరిపాలన చేస్తున్నారు అని తెలిపారు. తెలంగాణ లో గత ప్రభుత్వం ప్రాంతీయత ను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందని అన్నారు.ప్రాజెక్టుల నిర్మాణంలో  వైఫల్యం అయిందని తెలిపారు. సీపీఐ(యం) విధానాలకు అనుగుణంగా ఇండియా కూటమి నిర్ణయం మేరకు లౌకిక శక్తులు బలపరిచే క్రమంలో కాంగ్రెస్ కు ఎన్నికల మద్దతు ఇస్తున్నామని అన్నారు. పార్టీ నిర్ణయం మేరకు ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. పార్టీ సాంప్రదాయం ప్రకారం ప్రచారంలో పాల్గొని,రాజకీయ మద్దతు ధర్మాన్ని పాటించాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బి.చిరంజీవి,మండల కమిటీ సభ్యులు ముల్లగిరి గంగరాజు,సోడెం ప్రసాద్,మడిపల్లి వెంకటేశ్వరరావు,తగరం జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.