– వీఆర్‌వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్‌లు ప్రారంభం
– కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి
– వీఆర్‌వన్ ఫౌండేషన్ చైర్మెన్ అజిత వెంకటేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని వీఆర్ వన్ ఫౌండేషన్ చైర్మెన్ అజిత వెంకటే శ్వర్ రెడ్డి తెలిపారు. మంచాల మండల పరిధిలోని చెన్నా రెడ్డిగూడ, లోయపల్లి గ్రామాల్లో వీఆర్‌వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్‌లను శుక్రవారం ప్రారంభిం చారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మల్‌రెడ్డి అభిషేక్ రెడ్డి, వీఆర్ వన్ ఫౌండేషన్ చైర్మెన్ అజిత వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రా మాల్లో ప్రజలకు తాగునీరు అందించడం కోసం వాటర్ ఫిల్టర్లు ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, వీఆర్‌వన్ ఫౌండేషన్ చైర్మెన్ వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షులు వింజమూరి రాం రెడ్డి, చెన్న రెడ్డిగూడ మాజీ సర్పంచ్ ఆంబోతు కిషన్ నాయక్, లోయపల్లి మా జీ సర్పంచ్ ఏళ్లంకి అనిత నర్సింహ, మోతి లాల్‌నాయక్, మిద్దె శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు ఎడమ నరేందర్ రెడ్డి, కావలి శ్రీనివాస్, పీఏసీ ఎస్ డైరక్టర్‌లు జేనిగా వెంకటేష్, వెదిరె హనుమంత్ రెడ్డి, పీ.రమేష్, వేణుగోపాల్ రావు, నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య, వీఆర్‌వన్ ఫౌండేషన్ ఆర్గనైజర్లు ఏ.విష్ణు వర్ధన్‌రెడ్డి, ఆశ్వల బాల్‌రాజ్, మల్గలింగం, కడారి లింగం, మొగిలి మహేష్, రావుల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.