నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఆలేరు నియోజకవర్గంలోని గ్రామాలకు సాగు, త్రాగునీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముందుకు సాగుతున్నారు అని యాదగిరిగుట్ట పిఎసిఎస్ డైరెక్టర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఏలేందర్ రెడ్డి అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం మసాయిపేట కొత్త చెరువు కు సైదాపురం గొలుసుకట్టు చెరువు నుండి నీళ్లు వచ్చేలా చూడాలని బీర్ల ఐలయ్యకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ బీర్ల ఐలయ్య సానుకూలంగా స్పందించి నీరు చెరువుకు వచ్చేలా చూస్తానని అన్నారని తెలిపారు.