మండలంలోని గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎంపిడిఓ శ్రీనివాస్ అన్నారు . గురువారం నాడు మండలంలోని లొంగన్ హంగర్గా గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలు ఆయన పాల్గొన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, డబుల్ బెడ్ రూమ్ లు, నూతన రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలను గ్రామసభలలో చదివి ప్రజలకు వినిపించారు. అనంతరం అర్హులైన వారందరినీ గ్రామసభలు ఆమోదించడం జరిగింది. గ్రామసభలలో పేర్లు రానివారు కొత్తగా దరఖాస్తులు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, హంగార్గా జిపి సెక్రెటరీ అశోక్ గౌడ్, లొంగన్ జిపి సెక్రెటరీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.