పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యం

– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్
నవతెలంగాణ-రాయపోల్ : నిరుపేద కుటుంబాలు కష్టాలలో ఉన్నాయని తెలియగానే మీకు తోడుగా నేనున్నానంటూ క్షణాల్లో వెళ్ళిపోయి తనకు తోచిన సహాయం చేస్తూ గుండె ధైర్యాన్ని నింపుతారు ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకులు, మహమ్మద్ సుల్తాన ఉమర్. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందు ప్రియాల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పోతరాజు బాలయ్య కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు ప్రియాల్ పోతరాజు బాలయ్య  అనారోగ్యంతో బాధపడుతూ అయిదు రోజుల క్రితం మరణించడం చాలా బాధాకరం.అలాంటి నిరుపేద కుటుంబంలో విధి కాటు వేసి  అనారోగ్యంతో అకాల మరణం చెందడం కుటుంబం పెద్దదిక్కుని కోల్పోయి దిక్కు తోచని స్థితిలో మిగిలిపోయింది. కుటుంబ యజమాని మృతిచెందితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. ఈ పేద కుటుంబానికి మా వంతు సహకారం అందించడం జరిగింది. ఇంకా దయా హృదయనేతలు, మానవతావాదులు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పేద కుటుంబానికి మానవత్వంతో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోతరాజు లక్ష్మీనరసమ్మ, బాలమణి, కనకయ్య, రాజు, స్వామి, సుగుణ,నాగరాజు,బల్ నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.