
వ్యవస్థాపక అధ్యక్షుడు లింగమల్ల శంకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
మెరుగైన సమాజ నిర్మాణం కోసం మహనీయుల ఆశయ సాధన కోసం అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542 పనిచేస్తోందని వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకర్ అన్నారు.మన ఊరు మన సొసైటీ, మన దేశం మన రాజ్యగం, పే బ్యాక్ ద సొసైటీ లో భాగంగా మహనీయుల జీవిత చరిత్ర గ్రంధాలు ఉచితంగా పంపిణీ,మహనీయుల జయంతి ఉత్సవాలు నిర్వహించడమే సొసైటి లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.ఇందులో భాగంగా శుక్రవారం కోదురుపాక గ్రామంలో విద్యార్థులకు బారత రాజ్యాంగ గ్రంధాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.వచ్చేనెల ఫిబ్రవరి 11న ఆదివారం అల్ ఎంప్లాయిస్ సొసైటీ కాళేశ్వరం జోనల్ యువత అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ అధ్యక్షతన, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ కోఆర్డినేషన్ లో కొయ్యుర్ కమ్యూనిటి హాల్ లో రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ భార్య రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆమె జీవితం చరిత్ర గ్రంధాల పంపిణీ చేయడం జరిగిందన్నారు.మెరుగైన