– ఎన్ జి ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్
– ప్రధాన కార్యదర్శి తాళ్ల మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో మృతి చెందిన కుటుంబానికి అండగా ఉండటమే ఎన్ జి ఎఫ్ లక్ష్యం అని ఆ సంస్థ అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్ ప్రధాన కార్యదర్శి తాళ్ల మహిపాల్ రెడ్డి అన్నారు బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన చింతకుంట్ల మల్లమ్మ కుటుంబాన్ని సందర్శించి ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో చింతకుంట్ల మల్లమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు ఆమె గ్రామంలో అందరితో మంచిగా కలియ తిరిగి కొన్ని విషయాలపై చర్చించి వారి సంఘంలో ఎంతో మందిని బలోపేతం చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని అన్నారు అలాంటి వ్యక్తి మృతి చెందడం తీరనిలోటు అని తెలిపారు మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు మృతి చెందిన కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపి 50 కేజీల బియ్యాన్ని అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బొల్లు అశోక్, తాళ్ళ ప్రభాకర్ రెడ్డి, పెరుమాండ్ల సుమన్, షేక్ అజీమ్, చిర్ర వెంకన్న, రాపాక నవీన్, ఎడెల్లి రమేష్, అక్కెర శ్రీనివాసాచారి, గ్రామస్థులు బొల్లు మురళి, చింతకుంట్ల యాకయ్య, జెల్ల సోమయ్య, చింతకుంట్ల ఉపేందర్,చింతకుంట్ల మహేష్, బెజ్జం రవి, ఏర్పుల రాములు ఆశోద బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు.