పోషకాహార లోపాన్ని అధిగమించడమే ఎస్.ఎఫ్.ఎస్ హెచ్.సీ లక్ష్యం

– వాసన్ ఎస్.పీ.ఒ అనీల్ ఉప్పలపాటి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం స్థిరమైన ఆహార వ్యవస్థలను రూపొందించడం మే ఎస్ ఎఫ్.ఎస్ హెచ్.సి (సస్టెయిన్ బుల్ ఫుడ్ సిస్టం ఫర్ హెల్తీ కమ్యూనిటీస్) లక్ష్యం అని ప్రభుత్వేతర సేవా సంస్థ వాసన్ (వాటర్ షెడ్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ యాక్టివిటీస్ నెట్వర్క్) ఎస్.పి.ఒ (పధకం రాష్ట్ర స్థాయి అధికారి) అనీల్ ఉప్పలపాటి తెలిపారు. బుధవారం మండలంలోని వినాయక పురం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ రాందాస్,డాక్టర్ దీపక్ రెడ్డి తో   సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకాహార లోప రహిత గ్రామాలు తయారు చేయడానికి వాసన్ సంస్థ చేస్తున్న ప్రయత్నం గురించి వివరిస్తూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెంపొందించడం, రసాయన రహిత ఆహార పంటలు,పెరటి తోటలలో  కూరగాయలు,ఆకుకూరల సాగు,ఆహారం పట్ల ఉండే మూఢనమ్మకాల తొలగిస్తూ పోషకాహారం తీసుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించడంలో వైద్యుల సహాకారం,మద్దతు కోరడం జరిగింది అని అన్నారు.దానికి వైద్య అధికారులు స్పందిస్తూ సమాజహితం కోరే మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఎల్లప్పుడు ఖచ్చితంగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి అవసరమైన సహకారం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పధకం కోఆర్డినేటర్ నరసింహ రెడ్డి,న్యూట్రిషన్ శిరీష లు పాల్గొన్నారు.