మారుమూల తండాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం

– జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవతెలంగాణ – రామారెడ్డి
మారుమూల తండాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంగళవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని జగదాంబ తండా గ్రామపంచాయతీ ఫకీరాతాండాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల క్రింద రూ.10 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరవింద్ రెడ్డి, బట్టు తాండ మాజీ సర్పంచ్ రాతుల రెడ్డి నాయక్, రాతుల రవి నాయక్, రామారెడ్డి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వడ్ల లక్ష్మీరాజ్యం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.