స్వరాజ్య స్థాపనే ధర్మ సమాజ్ పార్టీ లక్ష్యం

– ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం హరీష్..
నవతెలంగాణ-రుద్రంగి
తెలంగాణ రాష్ట్రంలో 93% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ ఎన్నికల సమరంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో, ఓటు ఆయుధంతో ఆధిపత్య రాజకీయాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్మ యుద్ధాన్ని చేస్తున్నదని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం హరీష్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు..! ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో ప్రజా ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని భారత రాజ్యాంగ విధానాలను ఆచరిస్తూ దానిని రక్షించే ఏకైక పార్టీ ధర్మసమాజ్ పార్టీ మాత్రమేనని రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయం చేయడానికి ఈ ఎన్నికల్లో అణగారిన వర్గాల అభ్యర్థిగా ఆధిపత్య బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీలను వాటికి బీ టీమ్ గా ఉన్న పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పోటీ చేస్తున్నానని నియోజకవర్గ ఓటర్లందరూ ఆయా పార్టీల మోసపూరిత విధానాలను గమనించాల ని డబ్బు,మద్యం,మాంసం పంచే పార్టీ లను బహిష్కరించి ప్రజలందరి జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ఒక అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదించి మద్దతునిచ్చి తమ సమస్యల పరిష్కారం కోసమై టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు సురేష్,సతీష్,ప్రవీణ్,అజయ్, గంగరాజం,రాజేందర్,వెంకట్,నితిన్, అభిషేక్,పాల్గొన్నారు.