పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

– డబుల్ బెడ్ రూంల ఇండ్ల పత్రాల పంపిణీ 

– హుస్నాబాద్ ఎమ్మెల్యే  సతీష్ కుమార్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంమని, పేదల సొంతింటికల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్మిస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం  హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల లక్కీ డ్రాలో రెండు పడకల గదులు దక్కించుకున్న   260 మంది లబ్దిదారులకు డబుల్  బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశామన్నారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలనే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ లను అందించాడన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు తెలిపారు. లబ్ధిదారుల కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందన్నారు. పేదవారు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఇళ్ళు కట్టించడం జరిగిందని, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు.  సొంత జాగా కలిగివున్న ఇల్లు లేని ప్రతి కుటుంబానికి గృహలక్ష్మి పథకం వర్తింపచేసి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయం చేస్తుందని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకాన్ని అర్హులందరూ వినియోగించుకొని ఇల్లు నిర్మించుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, ఎంపీపీలు లకావత్ మానస సుభాష్, మాలోతు లక్ష్మీ బిలునాయక్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.