క్రీడాకారుల రాష్ట్ర,జాతీయ స్థాయికి తీర్చిదిద్దడం వర్సిటీ ఉద్దేశం..

The purpose of the varsity is to prepare the athletes to the state and national level.– యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన వైస్ ఛాన్సలర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
క్రీడాకారుల  ప్రతిభను  గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా  తీర్చిదిద్దడం తెలంగాణ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరి రావు పేర్కొన్నారు.గురువారం తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్ & ఉమెన్ చాంపియన్షిప్ 2024, పోటీలను యూనివర్శిటీ ప్లే గ్రౌండ్ లో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి  ప్రారంభించారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. అందుకు అన్ని రకాల అంగుళం ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.  రిజిస్ట్రార్ ప్రోఫెసర్. ఎం యాదగిరి  మాట్లాడుతూ  విద్యతో పాటు  సమాంతరంగా క్రీడలు ఎల్లవేళలా నిర్వహించాలని ఆటల వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు గేమ్స్ ప్రాక్టీసు చేసి యూనివర్సిటీ కి  గుర్తింపు తేవాలని సూచించారు.ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల్లోని 13 కళాశాలల నుండి పురుషులు, 11 కళాశాల  నుండి మహిళ  క్రీడాకారినులు సుమారు 150 మంది   క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. వాలీబాల్ పురుషుల విన్నర్స్ గా  తెలంగాణయూనివర్సిటీ  రన్నర్స్ గా గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ నిలిచింది. మహిళల విభాగంలో విన్నర్స్ గా  జి జి కాలేజ్ నిజామాబాద్  కైవసం చేసుకోగా  రన్నర్స్ గా  టీజీ డబ్ల్యూ ఆర్ డి సి  ఆర్మూరు  నిలిచింది. ఈ టోర్నమెంట్ లో  విజేతలకు మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ   ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్  ఆర్గనైసింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత , మరియు ఫిజికల్ డైరెక్టర్స్ డాక్టర్. బాలమని, రమ, రూప, అంజలి, అనిల్ కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు.